రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయం లో ఆలేరు ప్రబూత్వ విప్ MLA గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ గారి అధ్యక్షతన తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా తెరాస రాష్ట్ర నాయకత్వం తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ శవ యాత్ర మరియు నిరసన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మండల శాఖ తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు సెక్రటరీ జనరల్స్, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్, వివిధ గ్రామాల ఎంపీటీసీ లు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాలు అయినా విద్యార్థి, యువజన, మహిళ, మైనారిటీ, బిసి, ఎస్సీ ,ఎస్టీ, కార్మిక ,రైతు, సోషల్ మీడియా,విభాగాల అధ్యక్ష కార్యదర్శులు ,మరియు మండల నాయకులు ,జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు