రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం యాదాద్రి భువనగిరి జిల్లా:- ఆత్మకూర్ ఎం మండలకేంద్రంలో భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి ఆద్వర్యంలో ఈ నెల 25,26 తేదీలలో ఎం ఎన్ ఆర్ గార్డెన్ లో జరిగే ప్రశిక్షణా తరగతులకు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరుకావలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు మండల ఇంచార్జ్ సర్వీ శ్రీనివాస్ జిల్లా శిక్షణ తరగతుల కన్వీనర్ లింగ స్వామి గౌడ్, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బొట్టు అబ్బయ్య సీనియర్ నాయకులు బొబ్బలి ఇంద్రారెడ్డి గజరాజు కాశీనాథ్ మండల ప్రధాన కార్యదర్శిలు భిక్షపతి గౌడ్ రవీందర్ టౌన్ అధ్యక్షులు లోడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు