రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో ఆందోల్ మైసమ్మ దేవాదాయ శాఖ ఈవో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని వనస్థలిపురం చెందిన భాస్కర్ రావు కంప్లైంట్ తో కేసు దేవాదాయ శాఖ ఈవో మరియు సిబ్బంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 10వ తేదీన భాస్కర రావు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని పూజా కార్యక్రమానికి ఆలయ ప్రాంగణానికి వెళ్లగా పూజ టికెట్ ధర 30 రూపాయలు ఉండగా వంద రూపాయలు వసూలు చేయడం జరిగినది. మరియు ద్విచక్ర వాహనానికి ఇవ్వాల్సిన టికెట్ ఇవ్వకుండా ఆటో రిక్షా టికెట్ ఇచ్చి దానిపై ₹50 ఉండగా వంద రూపాయలు వసూలు చేయడం అని బాధితుడు ఇదేంటి అని అడగగా బాధితుని పై దురుసు మాటలతో ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడు ఏం చేయాలో తోచక ఇలా ఎంత మందిని మోసం చేస్తారని ఆవేదన పడి స్థానిక చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన పిదప పోలీసు యంత్రాంగం ఒక నాలుగు ఐదు రోజులు కేస్ ఫైల్ చేయకుండా కాలయాపన చేశారు. మళ్లీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న భాస్కర్ ఏసిపి ఉదయ్ రెడ్డి కి వాట్స్అప్ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వగా వెంటనే కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేసి మీకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బాధితుడు మాట్లాడుతూ ఒక గవర్నమెంట్ ఉద్యోగిని ఒక మాట అంటేనే వెంటనే సామాన్య ప్రజల పై కేసు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ ఒక సామాన్యుడు పోలీసువారికి కంప్లీట్ చేసిన వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు