రాయల్ పోస్ట్ ప్రతినిధి:యాదాద్రి భువనగిరి జిల్లా,అత్మకూర్ మండలం,సింగారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించిన మాజీ జెడ్పిటిసీ ప్రతికంఠం పూర్ణచందర్ రాజు‌సర్పంచ్ జామ యాదయ్య లు
ఈ సందర్భంగా పూర్ణచందర్ రాజు మాట్లాడుతూ పాఠశాలలో కట్టెలతో వంట చేస్తున్నారని పొగ మరియు పచ్చి కట్టెలతో మహిళా సంఘ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రభుత్వం సబ్సిడిపై గ్యాస్ సౌకర్యం కల్పించాలని కోరారు.
గత నాల్గు ఐదు నెలలుగా బిల్లులు రావటం లేదని వెంటనే అధికారులు బిల్లులు ఇప్పించటానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
మధ్యాహ్న భోజనంతో తల్లితండ్రులు సంతోషం వ్యక్తపరచారు వీరితోపాటు ప్రభాకర్ రెడ్డి హెచ్ యం జానయ్య ఉన్నారు.