రాయల్ పోస్ట్ ప్రతినిధి షాద్ నగర్ : ట్రాఫిక్ నియమాల పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ రఘు కుమార్ సూచించారు. షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్ రెడ్డి అధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులతో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో ట్రాఫిక్ ఎస్ఐ రఘు కుమార్ పాల్గొని డిగ్రీ చదివే వయస్సులోనే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఎంతో అవసరమన్నారు. లైసెన్స్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ లు చేయడం వల్ల వారికే కాకుండా ఇతరులకు కుడా ప్రమాదకరంగా మారుతున్నారని అన్నారు. తన పరిధిలో రోజూ సగటున ఒక ఏక్సిడెంట్ జరిగి యువతనే మరణిస్తున్నారని వివరించారు. ఇందుకోసం పోలీసులు డిగ్రీ కళాశాలల్లో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు కొన్ని రోజులు పోలీసులతో కలిసి డ్యూటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇందుకోసం విద్యార్ధులు ముందుకొస్తే వారు జీవితంలో ఎప్పుడు కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు మరియు రోడ్లపై, నియమాల పై పూర్తి అవగాహన వస్తుంది అని అన్నారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో క్రమశిక్షణ లేని వారితోనే సమస్యలు వస్తాయన్నారు. ఇలాంటి అవకాశాలు విద్యార్ధులు పొందడం వల్ల ఉత్తమ పౌరులుగా మారుతారని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీలత మాట్లాడుతూ అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడ ఇలాంటి బాధ్యతాయుత డ్యుటీలు చేయడం వల్ల వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ ప్రోగ్రాంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.