రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /భువనగిరి పట్టణంలో CSI చర్చి అర్బన్ కాలనీ రైల్వే గేటు దగ్గర భువనగిరి యందు జరిగినది, ఈ కార్యక్రమము లో భువనగిరి మండలానికి చెందిన 500 గిఫ్ట్ పాకెట్స్ దుస్తులు ఇవ్వడము జరిగింది, ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ ఆంజినేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, 17 వ వార్డ్ కౌన్సిల్లర్ చెన్న స్వాతి, MPP నరాల నిర్మల, ZPTC బీరు మల్లయ్య మరియు MPTC కిష్ణ, CSI చర్చి పాస్టర్ సుదర్శన్, మరియు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కే సత్యనారాయణ,పాల్గొన్నారు.
ఒక్కో గిఫ్ట్ పాకెట్స్ యందు ఒక చీర , అమ్మాయికి డ్రెస్ మెటీరియల్ మరియు ఒక జత పాయింటు షర్టు ఉంటాయి అన్నారు.భువనగిరి నియోజకవర్గము లోని నాలుగు మండలాలకు 1000 గిఫ్ట్ పాకెట్స్ దుస్తులు పంపినిచేశారు.
భువనగిరి 500, వలిగొండ 250, బీబీనగర్ 150, పోచంపల్లి- 100 మంజూరి చేశారు.ఆలేరు నియోజకవర్గము లోని ఎనిమిది మండలాలకు 1000 గిఫ్ట్ పాకెట్స్ దుస్తులు ఆలేరు 220, యాదగిరిగుట్ట160, రాజాపేట 140, మోటకొండుర్130, ఆత్మకూర్ 105,
గుండాల 95, బొమ్మలరామారం. 80, తుర్కపల్లి. 70 మంజూరి చేశారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కే సత్యనారాయణ తెలిపారు.