ఇంటర్మీడియట్ విద్యార్థులు అధైర్యపడొద్దు……

ఆత్మహత్యలకు పాల్పడవద్దు…..

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో చాలా అవకతవకలు జరిగి విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత కరోనా సమయంలో పరీక్షలు పెట్టొద్దని NSUI తీవ్రంగా పోరాటం చేసిన పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఫెయిల్ చేసి ఈ రోజు ఇద్దరి విద్యార్థుల చావులకు ప్రభుత్వం కారణం అయిందని విద్యార్థులకు అండగా NSUI ఎల్లప్పుడూ ఉంటుందని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని శనివారం పత్రికా సమావేశంలో NSUI యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రభుత్వమే కారణమని, విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డుపై విద్యార్థుల పక్షన పోరాటం చేయడానికి వెళ్లిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ను పోలిసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఎన్ని అరెస్టులైన, ఎన్ని కేసులైన వెనక్కి పోయేదిలేదని విద్యార్థులను పాస్ చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఎవరూ అధైర్య పడొద్దని మంగ ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, జిల్లా కార్యదర్శి పాండాల శరత్ ఉన్నారు.