రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / స్థానిక భువనగిరి పట్టణంలోని వైఎస్సార్ గార్డెన్ లో జిల్లా మహిళా, శిశు దివ్యాంగుల మరియు వయోవ్రుద్ధుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిలుగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి హాజరు అయినారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ, దివ్యాంగుల హక్కుల చట్టం గొప్పతనం వివరిస్తూ, జిల్లాలోని అందరూ దివ్యాంగులకు న్యాయం జరుగుతున్నదని, అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందుతున్నాయని, సంబంధిత శాఖలు సకాలంలో దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం అందిస్తున్నందుకు ఆనందంగా ఉన్నదని తెలిపారు.జిల్లా అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా దివ్యాంగుల సంక్షేమంలో ముందంజలో ఉందని, దివ్యాంగులకు అన్నీ రకాలుగా సహాయపడే టోల్ ఫ్రీ నెంబరు 1800-572-8980 ఉన్నదని, ఈ నెంబరుకు ఫోన్ చేసి తమ తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చు నని తెలిపారు. కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు ఇచ్చిన భువనగిరి, రాజాపేట భవిత సెంటర్ దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. అలాగే జిల్లాలోని ఆయా రంగాల్లో కృషిచేసిన వ్యక్తులకు శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి కృష్ణవేణి మాట్లాడుతూ, జిల్లాలో దివ్యాంగుల సంక్షేమానికి చేసిన అందజేసిన పరికరాలు, లోన్లు, సౌకర్యాలను గూర్చి వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, Addl. PD నాగిరెడ్డి, 6వ స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనురాధ, జిల్లా కోఆర్డినేటర్ జోసెఫ్, రూరల్ SI సైదులు, సూపరింటెండెంట్ శశికళ, FRO తదితరులు పాల్గొన్నారు