రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / దివ్యాంగుల పట్ల మానవత్వము చాటి స్వయంగా తన పోలీసు వాహనంలో ఎక్కించుకుని కలెక్టర్ వద్దకు తీసుకు వెళ్లిన భువనగిరి రూరల్ ఎస్ఐ సైదులు పోలీస్ వ్యవస్థకు వన్నె తెచ్చేలా వ్యవహరించారు. దివ్యాంగుల పట్ల మానవత్వం చాటుకున్న రూరల్ ఎస్సై ని ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర, జిల్లా నాయకులు ఉపేందర్, ప్రకాష్ , వెంకటేష్ యాదవ్ లు , స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
పాల్గొన్నారు.