రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పట్టణంలో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా AITUC ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణి.అర్ధ శతాబ్దానికి పైగా దేశ ప్రజలకు విశిష్టమైన సేవలందిస్తున్న బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి నిర్వీర్యం చేయొద్దు అని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్ డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా 9 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 16,17 తేదీల్లో 48 గంటలపాటు నిరవధికంగా చేపట్టిన దేశవ్యాప్త జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమ్మె లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని SBI బ్యాంకు ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచి బ్యాంకులు ప్రైవేట్ పరం ఐతే జరిగే నష్టాలను ప్రజలకు వివరించి ఇమ్రాన్ మాట్లాడుతూ.దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన , అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు , ఖాతాదారులు కలిగిన 22,219 బ్రాంచీలు , 51 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన , 66 సంవత్సరాల సువర్ణ చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI బ్యాంక్ ను బడా వ్యాపార వేత్త ఆ దాని కంపెనీని భాగస్వామిగా చేరుస్తూ ఒప్పందం చేయడం దేశద్రోహం అనీ,
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ సమర్పణ లో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించిందని ఇమ్రాన్ ఆరోపణ చేశారు అందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయుటకు ఉద్దేశించిన జాతీయ బ్యాంకుల ఆమైండ్మెంట్ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల ఎజెండాలో చేర్చిందని , గతంలో BJP మోడీ ప్రభుత్వం IDBI బ్యాంకు లో మెజారిటీ వాటాను LIC నుండి కట్టబెట్టి ప్రైవేటు బ్యాంకుగా IDBI బ్యాంకుకు ముద్ర వేసిందని ఇమ్రాన్ దుయ్యబట్టారు, 28 ప్రభుత్వ రంగ బ్యాంక్ ల��