రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతులకు వెను వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. బుధవారం రోజు సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం అబ్దుల్లాపురం వెంకటేష్ అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో జరుగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఆరు కాలం కష్టపడి అనేక ఇబ్బందులు ఎదుర్కొని వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు పండించి పండిన పంటను రైతులు మార్కెట్ కు తెస్తే ఆ ధాన్యమును వెనువెంటనే కొనుగోలు చేయక రెండు నెలలకు పైగా కొనుగోలు కోసం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నదని ఇంకా చాలా మార్కెట్ లో 40 శాతం పైగా ధాన్యం నిల్వలు ఉన్న పరిస్థితి ఉన్నదని ధాన్యం నిల్వ కోసం తెచ్చిన పట్టాల కిరాయి రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితితో ఆందోళన చెందుతున్నారని, రోజు మార్కెట్లో కొనుగోలు కోసం పని మాలి వెళ్ళవలసి వస్తుందని రైతుల కష్టాలు చెప్పి పరిస్థితులో లేవని ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించి రైతులను అన్ని విధాల ఆదుకోవాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని ప్రతిరోజు మండల వ్యాప్తంగా పర్యటన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇస్తానన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటి స్థలం ఉన్న వారికి ఆరు లక్షల రూపాయలు నిర్మాణం కోసం, పెన్షన్లు, రేషన్ కార్డులు, మూడెకరాల భూమి ఇస్తామన్న హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని సూచించారు. ఏడు సంవత్సరాల కాలంలో మండలంలో ఒక్కరికి ఒక ఇంటిని కూడా నిర్మాణం చేసి ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా భువనగిరి మండలంలో కొనసాగుతున్న భూపంపిణీ నిషేధం ఎత్తివేసిన భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి, ఇంటి స్థలం లేని వారందరికీ 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసినారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బిసి ,మైనార్టీ కార్పొరేషన్ లోన్స్, వ్యక్తిగతమైన రుణాలు ఇచ్చేకాడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నదని, సంక్షేమ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని అమలు చేయాలని అన్నారు. వాగ్దానాల అమలు కోసం రానున్న కాలంలో గ్రామగ్రామాన సర్వేలు నిర్వహించి వాటి అమలు కోసం పోరాటాలను ఉద్ధృతం చేస్తామని నర్సింహ తెలియజేసినారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, ఏదునూరి మల్లేశం, కొండ అశోకు, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, సిలివేరు ఎల్లయ్య, మోటే ఎల్లయ్య, ఎల్లంల వెంకటేష్, కొండాపురం యాదగిరి, శాఖా కార్యదర్శులు నరాల చంద్రయ్య, కూకుట్ల కృష్ణ, చిక్కుల చంద్రమౌళి, మధ్యపురం బాల్ నరసింహ పాల్గొన్నారు.