రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని గోపాల్ పురం గ్రామంలో కబ్జాకు గురవుతున్న ఏడావుల చెరువును కాపాడాలని, అదేవిధంగా చెరువుల కబ్జాకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేయడం జరిగింది బుధవారం మండలంలోని గోపాల్ పురం గ్రామంలో కబ్జాకు గురవుతున్న ఏడావుల చెరువును తుర్కపల్లి మండల కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు,తలారి అశోక్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన సందర్భంగా మాట్లాడడం జరిగింది సుమారు మూడు ఎకరాల నిండు కుండ లాంటి ఏడావుల చెరువును జేసీబీలు,టిప్పర్లతో మట్టిని తెచ్చి నింపి చెరువును నామరూపాల్లేకుండా చేస్తున్న పనులను నిలిపివేయడం జరిగిందిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులకు టేలి ఫోన్ ధ్వారా పిర్యాదు చేసినట్లు తెలిపారు సంబంధిత చెరువుల కబ్జాలకు పాల్పడుతున్నది ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు సంబంధిత రియల్ ఎస్టేట్ మాఫీయాపై చర్యలు తీసుకోని పక్షంలో గ్రామ ప్రజలు, ఆయకట్టు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కోట సురేష్, భూక్యా రమేశ్ నాయక్,బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు