రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /తుర్కపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ పోరాటపలితంగానే చెరువును కాపాడమన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్.కబ్జాకోరులపై చర్యలు తీసుకోవడంలో విజయం సాధించామన్న కాంగ్రెస్ సేవాదల్ మండల అధ్యక్షుడు తలారి అశోక్.యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గోపాల్ పురం గ్రామంలో గల ఏడావుల చెరువును కబ్జాచేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసులు నమోదు చేయించి కబ్జాకోరులనుండి చెరువును కాపాడడం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాట పలితమేనని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,మరియు సేవాదల్ మండల అధ్యక్షుడు తలారి అశోక్ లు అన్నారు గోపాల్ పురంలో రియల్ ఎస్టేట్ మాఫియా ఏడావుల చెరువును కబ్జాచేస్తున్న విషయం తెలుసుకుని వెళ్లి చెరువును పరిశీలించి బారి యంత్రాల సహాయంతో నిండు కుండాలాంటి చెరువులో పోస్తున్న మట్టిని పోయకుండా నిలిపివేసి ఇరిగేషన్ అధికారులకు పిర్యాదు చేయగా గురువారం ఇరిగేషన్ అధికారులు చెరువును పరిశీలించి కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు నిజమేనని తేల్చి కబ్జాలకు పాల్పడుతున్న సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులపై స్థానిక తహశీల్దార్ కు రాతపూర్వకంగా పిర్యాదు చేసి కేసులు నమోదు చేయించి కబ్జాకోరుల నుండి చెరువును కాపాడినట్లు చెప్పారన్నారు చెరువులో అక్రమంగా పోసిన మట్టిని తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారని పేర్కొన్నారు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం ఐతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు చెప్పారు