రాయల్ పోస్ట్ భువనగిరి :భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం నిర్వహించిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని బూత్ ఎన్రోలర్ లను కోరారు.

పెట్రోల్, డీజల్ మరియు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుల పై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించాలని కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని, ఏన్ని కేసులు పెట్టిన ధైర్యంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదే సమావేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్న ఐదవ వార్డు కు చెందిన ఎండి రహీం కు 25 వేల ఆర్థిక సహాయం అందించి త్వరలో కోరుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తీసుకున్న సత్యనారాయణ, పోత్నాక్ ప్రమోద్, తంగళ్లపల్లి రవికుమార్, k. సోమయ్య, బర్రె జహంగీర్, కైరంకోండ వెంకటేష్, జగన్ మోహన్, అరపక నర్సింహ,పడిగెల ప్రదీప్, బెండ శ్రీకాంత్, సలావుద్దీన్, ఎండి మజాజర్, అంగడి నాగరాజు, రఫియుద్దిన్, యాదగిరి, మల్లారెడ్డి, రషీద్, అవైస్ చిస్తి, ఎడమ ప్రవీణ్, కుర వెంకటేష్, ఏజస్, అమర్, అజహర్ తదితరులు పాల్గొన్నరు.*