రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: శ్రీరాంపూర్ బస్ స్టాండ్ ప్రాంతం లో తరుచు యాక్సిడెంట్ లు జరిగి చనిపోయిన మరియు గాయాలైన ప్రదేశాలను సందర్శించిన రామగుండం ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ IPS ---వివరాల్లోకి వెళ్తే---

శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరాంపూర్ బస్ స్టాండ్ ప్రాంతంలో తరుచు యాక్సిడెంట్ లు జరిగి చనిపోయిన ప్రదేశాలను శరత్ చంద్ర పవర్ గారు IPS,జైపూర్ ఏసీపీ నరేందర్ గారు,శ్రీరాంపూర్ సి.ఐ రాజు గారు,శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్ గార్లతో కలిసి బ్లాక్ స్పాట్ ను సందర్శించారు.రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఓఎస్డీ శరత్ చంద్ర పవర్ గారు మాట్లాడుతూ….మానవ తప్పిదం,అతివేగం అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.HKR,R&B,పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయంతో ప్రమాదం జరిగిన మరియు బ్లాక్ స్పాట్స్ వద్ద ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్,రేడియం స్టెడ్స్,బ్రింగ్ లెటర్స్,సైనింగ్ బోర్డ్స్,వేగ నియంత్రణ బోర్డు త్వరలో ఏర్పాటు చేయాలి అని అన్నారు.

వేగ నియంత్రణ ప్రమాదాల నివారణ గురించి స్పీడ్ లేజర్ గన్ తో ప్రతిరోజు తనిఖీలు చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.మద్యం సేవించిన వారికి అతి వేగంగా వాహనాలు నడిపిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపినారు.

రామగుండం ఓఎస్డి శరత్ చంద్ర పవర్ IPS గారితో పాటు జైపూర్ ఏసీపీ నరేందర్ గారు,శ్రీరాంపూర్ సి.ఐ రాజు గారు,శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్ గార్లు ఉన్నారు.