తాండూర్ సర్కిల్ ఆఫీస్ లో బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్ గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గుప్తనిధుల పేరుతో మోసం చేస్తున్న నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది

, షేక్ రషీద్ త:: నురోద్దిన్ , వ: 34 సం: లు, నివాసము పెద్దపేట గ్రామము, భీమిని మండలం అనే వ్యక్తి ఇంటిపక్క వ్యక్తి షేక్ అక్బర్ చూసి భీమిని పోలీస్ స్టేషన్ లో గుప్తా నిదుల తవ్వకాలు రషీద్ ఇంటిలో జరుగు తున్నవని ఫిర్యాది చేయగా, భీమిని పోలీస్ వారు పిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంబించగా రషీద్ తన ఇంటిలో గుప్తా నిధులు ఉన్నాయని అనుమానము మరియు మూడనమ్మకముతో , ఈ క్రింది వారితో గుప్తా నిధుల కోసం ఇంటిలో పూజలు చేయించి . గోతి తవ్విన్చినానని నేరము ఒప్పుకున్నాడు.అతను చెప్పిన సమాచారం ఆధారంగా మిగతా నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొందరు పరారీ లో ఉన్నారు.

పట్టు పడిన నిందితుల వివరాలు::

1.షేక్ రషీద్ త: నాసర్ మొహమ్మద్, వ: ౩౦ సం: లు, కులము : దూదేకుల, వృత్తి : కూలీ ,నివాసము :: పెద్దపేట గ్రామము భీమిని మండలం ( ఇంటి ఓనర్ )

2.పర్ధాన్ అంజయ్య, త: భీమ మేర , వ: ౩5 సం: లు, కులము : బారే, వృత్తి : కూలీ ,నివాసము :: పెద్దపేట గ్రామము భీమిని మండలం
3.ముత్తినేని సత్యనారాయణ , త: మల్లయ్య , వ: 40 సం: లు, కులము : పేర్క , వృత్తి :వ్యవసాయము ,నివాసము :: పోలంపల్లి గ్రామము కన్నేపల్లి మండలం

  1. చేదం నగేష్ త: జల్లయ్య , వ: సం:26 లు, కులము : నాయకపోడ్, వృత్తి :వ్యవసాయం,నివాసము ::చింతపల్లి గ్రామము తిర్యాని మండలం
  2. మడవి దౌలత్ రావు త: దిన్ధర్ష , వ: ౩౩ సం: లు, కులము : గోండ్ , వృత్తి : కూలీ ,నివాసము ::తిర్యాని గ్రామము తిర్యాని మండలం
  3. మంగ స్వామి త: రాజం, వ: 46 సం: లు, కులము : నాయకపోడ్, వృత్తి :కూలీ ,నివాసము ::చిన్న అరటిపల్లి గ్రామము తిర్యాని మండలం
  4. దాసరి వెంకటేష్ , త: పాపయ్య , వ:37 సం: లు, కులము : నాయకపోడ్, వృత్తి,కూలీ ,నివాసము :: తిర్యాని గ్రామము తిర్యాని మండలం
  5. తట్లాసాగర్ త: చిన్నయ్య , వ:29 సం: లు, కులము : నాయకపోడ్, వృత్తి : కూలి, నివాసము ::చింత పల్లి గ్రామము తిర్యాని మండలం
  6. పెద్దల్ల శంకరయ్య త: LATE గట్టయ్య , వ: 43 సం: లు, కులము : కుర్మా , వృత్తి : కూలీ ,నివాసము :: నాయకంపేట్ మొక్కంపల్లి గ్రామము కన్నేపల్లి మండలం
    10.పెట్టం శంకర్ త:చంద్రయ్య , వ:47 సం: లు, కులము : పేర్క, వృత్తి :కూలీ ,నివాసము :: పేర్క పల్లి గ్రామము తిర్యాని మండలం
  7. బోర్కుట్ శంకర్ త: తుకారం , వ: 26 సం: లు, కులము : నేతకని , వృత్తి :కూలీ ,నివాసము :: గెర్ర గ్రామము దహిగం మండలం

పరారిలో ఉన్న వారు ::

1.గుండయ్య గొల్లగట్టు గ్రామము కన్నేపల్లి ,
2) శ్రావణ్
3) స్వామి మరియు స్వామి

జప్తు చేసిన వస్తువులు.

1.కొబ్బరి కయ, 2) అగ్గిడబ్బ, 3) కొడవలి, 4) రెండు తట్టలు. 5) చిన్న మొలలు, 6) రెండు ఒక రూపాయ బిళ్ళలు, 7) ఒక గడ్డ పార, 8) ఒక పార . 9) బంగారు రంగు పూత కల్గిన నాలుగు మొలలు.

వివరాల్లోకి వెళితే…..
పెద్దపేట్ , భీమిని గ్రామములలో దేవుని పునకము వచ్చి మీ ఇంటిలో గుప్తా నిధులు ఉన్నవి, మీరు గుప్తా నిధులు తవ్వించుకుంటే వాటి ద్వార లాభం పొంది మీరు లాభం పొందుతారు అని చెప్పినారని , అదే వారికి మనసులో తట్టుకొని, షేక్ రషీద్ త:: నురోద్దిన్ , వ: 34 సం: లు, నివాసము పెద్దపేట గ్రామము, భీమిని మండలం గారు, గుప్తా నిధులు తానే తవ్వించుకొని లాభం పొందాలనే ఉద్దేశముతో, దురాలోచనతో ఇట్టి విషయాన్నీ పరధన్ అంజయ్య కు చెప్పగా , అంజయ్య వెళ్లి ముత్తినేని సత్యనారాయణ కు చెప్పగా, తనకు గుప్తా నిధులు తీసేవారు తెలుసు అని తిర్యాని మండలాని కి చెందిన పెట్టం శంకేర్ తో ఫోన్ ద్వార మాట్లాడి చెప్పగా, తను సరే దానికి అల్లు పట్టేవారు నగేష్ అనే వ్యక్తి ఉన్నాడు అతనికి చెప్పి తీసుక వస్తాను అని వారితో మంగ స్వామి, దాసరి వెంకటేష్, మడవి దౌలత్ రావు, సాగెర్ ల కలసి వారందరూ షేక్ రషీద్ ఇంటిలో గుప్తా నిధులు ఉన్నవి తీయాలని ఉద్దేశముతో పెద్దపేట లోని షేక్ రషీద్ ఇంటికి వెళ్లి చూసి సరే మేము గుప్త నిధులకు పూజలు చేసి , గుప్తా నిధులు తీస్తామని నమ్మించి, మొదటగా తేది : 18-11-2021 రోజు కు ముందు తిర్యాని నుండి కావాల్సిన పూజ సమానులు తీసుకొని వాటితో పెద్దపేట కు రాగ, అదే రోజు పరధన్ అంజయ్య,సత్యనారాయణ లు కూడా ముకంపల్లి గ్రామానికి చెందిన పెద్దల శంకేర్ ను తీసుక వచ్చి ఇతనికి కూడా గుప్త నిధులు తీసే అనుభవము ఉంది అని చెప్పగా, అందరు కలసి రాత్రి ముగ్గులు వేసి , అంజనము వేసినట్లు నమ్మించి, అడ్డుగా వస్తుందని ఇంటి గోడను కూడా పగులకొట్టి , ఇంటిలోని బండ్లను తీసి, పూజలు చేసి దాదాపుగా ( 3 ) ఫ్ఫీట్ల లోతు తో గోతి తవ్వి ,తెల్లవారే దాక పూజలు చేసిన వారికి ఎలాంటిది లభించనందున మరల ప్రయతం చేస్థాము అని తవ్విన గోతిని పూడ్చి వెళ్ళిన తరువాత, రషీద్ కు వారి వాళ్ళ కాలేదని మరో వ్యక్తి దాహేగాం, గొర్రె గ్రామస్తుడయిన బోర్కుటే శంకేర్ ను సంప్రదించగా తను మరో ముగ్గురు తో తేది 10-12-2021 రాత్రి బోర్కుటే శంకర్ రషీద్ ఇంటికి పూజ సామానులతో వచ్చి ఏవేవో పూజలు, ముగ్గులు వేసి మరల గోతి తవ్వగా, రషీద్ ఇంటిపక్క వ్యక్తి షేక్ అక్బర్ చూసి భీమిని పోలీస్ స్టేషన్ లో గుప్తా నిదుల తవ్వకాలు రషీద్ ఇంటిలో జరుగు తున్నవని ఫిర్యాది చేయగా, భీమిని పోలీస్ వారు రంగములోకి దిగి, దర్యాప్తు , ప్రారంబించగా రషీద్ గారు తన ఇనితిలో గుప్తా నిధులు ఉన్నాయని అనుమానము మరియు మూడనమ్మకముతో , ఈ క్రింది వారితో గుప్తా నిధుల కోసం ఇంటిలో పూజలు చేయించి . గోతి తవ్విన్చినానని నేరము ఒప్పుకున్నాడు.నేరస్తలము షేక్ రషీద్ ఇంటి వద్ద గోతి తవ్వి ఉండి, గోడ పగులకొట్టి ఉండి, ముగ్గులు వేసి, నిమ్మకాయలు పెట్టి, కొబ్బరి కాయ , బూడిద గుమది కాయ లు కొట్టి, పసుపు, కుంకుమలు చల్లి ఉండి గా , వాటిని పంచనామా చేసి , కొట్టిన గుమ్మడికాయ , నిమ్మకాయలు, కొబ్బరి కాయ భవిష్యత్తులో అదేవిదముగా ఉంచలేము కాబట్టి వాటిని అక్కడే ద్వంసము చేసి, కుంకుమ పాకెట్లు, కొట్టని కొబ్బరి కాయ, ఒక కొడవలి స్వాదీన పరుచుకోవడం జరిగింది.

ఎవరు కూడా మూడనమ్మకాలు,మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి అని , గుప్తనిధులు తీస్తామని ఎవరయిన మోసపూరిత మయిన మాటలు చెప్పి వారి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోకూడదు అని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ గారు ప్రజలకు విన్న వించినారు.