రాయల్ పోస్ట్ ప్రతినిధిభువనగిరి డిసెంబర్ / భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి శిక్షణ శిబిరాలు స్థానిక వెన్నెల కాలేజ్ ఎల్లమ్మ గుడి దగ్గర జిల్లా అధ్యక్షులు పి.వి. శ్యామ్ సుందర్ రావు ఆధ్వర్యం లో ప్రారంభం చేశారు.
శ్యాంసుందర్ మాట్లాడుతూ.ఈ శిక్షణ తరగతులు పార్టీబలోపేతానికి,పార్టీలో క్రమశిక్ష ణను తెలుపుతూ2023 లో బిజెపి పార్టీ గెలుపు కొరకు సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
డిసెంబరు 13,14,15 తేదీలలో భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులుజరుగుతాయన్నారు.
ఈ శిక్షణ తరగతుల్లో13వ తేదీ న5 సెషన్లు14వతేదీన 5సెషన్లు 15వతేదీన2 సెషన్లసాయంత్రం జిల్లా కార్యవర్గ సమావేశంతో ముగుస్తుందన్నారు.ఈ శిక్షణా తరగతులు రాష్ట్ర స్థాయిలో వివిధ అనుభవజ్ఞులై న రిటైర్డ్ ప్రొఫెసర్ల చేత సైద్ధాంతి క సిద్ధాంతాల ద్వారాభారతీయజనతాపార్టీ 2023 తెలంగాణలో అధికారంలోకి రావడానికి అదే విధంగా సిద్ధాంతపరమైన నైతిక విలువల గురుంచి తెలియజేయడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలోభారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జాతీయనాయకులు,జిల్లా కార్యవర్గం, మండలఅధ్యక్షులు,వివిధ మోర్చాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.