1. యూనిఫామ్ లో బైక్ పై రాంగ్ రూట్ లో వెళుతున్న పోలీస్ కు రూల్స్ వర్తించవా?.

జవాబు: డ్యూటీ లో ఉన్న పోలీసు వారికి ఆపదలో వున్నారు కాపాడండి అని ఫోన్ వస్తే, తాను అందరిలా సరి అయిన రూట్లో వెళితే సకాలంలో చేరుకోకపోవచ్చు, ఆపదలో ఉన్నవారిని కాపాడడం ముఖ్యం, అంతేకాని తాను రాంగ్ రూట్లో వెళుతున్నానా , సరైన రూట్లో వెళుతున్ననా అని ఏ పోలీసు ఆలోచించడు, ఆపదలో ఉన్నవారిని కాపాడడం ముఖ్యం (మనవాళ్ళు ఆపదలో ఉంటే మనం రూల్స్ చూసుకుంటు వేళతామా)

  1. డ్యూటీ లో  మోటార్ సైకిల్ పై వెళుతున్న  పోలీసు కు హెల్మెట్ అవసరం లేదా ?

జవాబు:  డ్యూటీ లో ఉన్న పోలీసుకు ఒక నేరస్థుడు, నేరంచేసి బైక్ పై వెళుతూ కొంత దూరం వెళ్ళాక బైక్ పడేసి పరుగెత్తుతూ ఉంటే, అతన్ని వెంటాడుతున్న పోలీస్ బైక్ ఆపి స్టాండ్ వేసి, హెల్మెట్ తీసి బండికి తగిలించి నేరస్తుని వెంట బడితే దొరుకుతాడా? పరిగెత్తే వారికి హెల్మెట్ అడ్డంకి కాదా!

  1. ట్రాఫిక్ పాయింట్ లో ఉన్న పోలీస్ , ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులను కెమెరాలో బందిస్తూ ఉంటే, ఇట్టి డ్యూటీ ని 10 వేలు ఇస్తే ఎంతో మంది చేస్తారనివిమర్శ.

జవాబు: అనేక బాధ్యతలతో ట్రాఫిక్ డ్యూటీ ఒకటి, అనేక పరీక్షలను ఎదుర్కొని పోలీస్ ఉద్యోగానికి ఎంపికై ట్రైనింగ్ చేసిన అధికారి, తన విధుల్లో భాగంగా,  ఎండ, వాన, పండగ, పబ్బం అనేవి లేకుండా, ట్రాఫిక్ లో నిత్యం  వాహన కాలుష్యంతో తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా తనవిధులను సక్రమంగా నిర్వర్తించేవారిని ఈ విధంగా విమర్శించడం తగునా, అలా విమర్శించేవారు తాము పోలీసు ఉద్యోగానికి ఎందుకు రాలేదు?

  1. ట్రాఫిక్ పోలీసు అధికారి డబ్బులు లెక్కబెడుతూ ఉంటే, లంచం సొమ్ము లెక్కబెడుతుండు?

జవాబు: తన విధిలో భాగంగా ట్రాఫిక్ పోలీస్ అధికారి వాహనదారులపై వేసిన జరిమానా ను ప్రభుత్వ ఖాజానలో ఒక్కపైసా తేడాలేకుండా కట్టాలి ఇది గమనించక అనవసరపు విమర్శ తగునా?

5.  సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్న పోలీస్ లకు ట్రాఫిక్ రూల్స్ వర్తించవా?

జవాబు: తాము స్వంత పనులమీద వెళ్లే వారేవరికైనా ఒక్కటే రూల్, కానీ పోలీస్ ఉద్యోగం అలా కాదు, పోలీస్ వారు సకాలంలో వెళ్లకపోతే, ప్రజల మాన, ప్రాణాలు పోవచ్చు, లేదా ఆస్తులు తగలబడవచ్చు, శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చు, పోలీస్ ను విమర్శించేవారు ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి.

  1. ట్రాఫిక్ పోలీసులు వాహణదారులపై హెల్మెట్ జరిమానాలు వేస్తున్నారు ఎందుకు?

జవాబు:  బైక్ ప్రమాదాలలో దాదాపుగా 80 శాతం మరణాలు తలకు గాయలై మరణిస్తున్నారు, ఒకసారి ఫైన్ వేస్తే మరోసారి హెల్మెట్ దరిస్తారని, తద్వారా తమకుటుంభానికి రక్షణగా ఉంటారని, పోలీస్ భావన ఇది ఎవరికోసం, బైక్ వాహణదారుడు చస్తే నష్టం ఎవరికి? పోలీస్ కా చనిపోయిన కుటుంబానికా ఆలోచించండి?

  1. వాహనంనకు సంబంధించిన పేపర్లు సరిగ్గా లేవని తరుచుగా ట్రాఫిక్ పోలీస్ జరిమానాలు వేస్తున్నారు ఎందుకు?

జవాబు: వాహనంనకు సంబంధించిన పేపర్లు సరిగ్గా లేకపోతే వాహనం యాక్సిడెంట్ కు గురైనపుడు, వాహనం యొక్క పేపర్ల విలువ అప్పుడు తెలుస్తోంది, ఇన్సూరెన్స్ లేకపోతే ప్రమాదంలో ఎదిటి మనిషి గాయాలకు గురైన లేదా మరణించినా వారికి డబ్బులు ఇన్సూరెన్స్ వారు ఇవ్వరు, సంబంధిత “కోర్టు” ప్రమాదంనకు గురిచేసిన డ్రైవర్ ఇట్టి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అతని అస్థిఏదైన ఉన్న దాన్ని జప్తు చేసి కట్టమని అంటుంది, జరిమానా కట్టని యెడల జైలుశిక్ష విధిస్తుంది” గోటితో పోయే దానికి గొడ్డలి తెచ్చుకోవడం సామెత విన్నారా? అది ఇదే మరి, ఇది ఎవరి మంచికి ఆలోచించక్కర్లేదా.

ప్రతిదినం రాత్రుళ్ళు మనం వెచ్చగా ఇంట్లో గుండెలమీద చెయ్యి వేసుకొని హాయిగా పడుకుంటున్నాం, మనం హాయిగా ఇంట్లో నిద్రిస్తే రాత్రుళ్ళు మన ఇంటిచుట్టూ అహర్నిశలు కంటిమీద కునుకు వేయకుండా పోలీసువారు తిరుగుతున్నారని మనలో ఎందరం గుర్తించాం ?, ప్రతి పండగలకి మనం మనకుటుంబసభ్యులతో పండగలు జరుపుకుంటాం కాని పోలీస్ కుటుంబాలు తమ కుటుంభాలతో పండగ జరుపుకోవడం అరుదు అని ఎంతమందికి తెలుసు?

పోలీస్ అంటే వారిలో కర్కశత్వమే కనబడుతుంది, వారిలో మానవత్వం కనబడలేదు కదూ, ఎవరైనవ్యక్తి మరణించి కుళ్ళిపోయిన స్థితిలో ఉంటే రక్తసంబంధికులు సైతం ముక్కుమూసుకొని దూరంగా ఉంటారు, కాని పోలీస్ అలాకాదు వారెవరైనా సరే తమస్వంతవారే అనుకుంటారు, అవ్యక్తి పోస్టుమార్టం నుండి మొదలు వారిని ఖననం చేసే దాకా అన్ని తానై వ్యవహరిస్తారు ఇది ఎంతమందికి తెలుసు?

పోలీస్ పై కుహనవిమర్శలు మానండి, ఎక్కడో ఓ పోలీసు తప్పుచేస్తే వ్యవస్థ మొత్తం తప్పుచేసినట్లు సోషల్ మీడియాలో విమర్శలు, ఇది సబబుకాదు, పోలీస్ అంటే మనలోనే వాడే, మనతోటివాడే అని గ్రహించండి.