రాయల్ పోస్ట్ ప్రతినిధి నాచారం హైదరబాద్: స్వీయ రక్షణ కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని వ్యాక్సిన్ తీసుకోవాలని మాస్కు ధరించాలి, బహిరంగ ప్రదేశాల్లో ఆఫీసుల్లో, షాపింగ్ మాల్స్ లలో ఇంటి నుండి బయటకి వెళ్ళేటప్పుడు ప్రజలు మాస్కు తప్పని సరిగా ధరించాలన్నారు. లేనియెడల వారికి రూ. వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలను నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా తమ రక్షణ కోసం పాటించాలని మరియు కరోనా నిబంధనలు అమలు చేయడానికి ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ప్రతి కాలనీలో, బస్తీ లల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్క్ ధరించని వారికి, బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగిన, ఉమ్మి వేసిన వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది . ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ అందరు మాస్కు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.- నాచారం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.