రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామానికి చెందిన తెలంగాణ నేతకాని మాహార్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నేతకాని మహార్ సమన్వయ కమిటి రాష్ట్ర సభ్యులు, దుర్గం గోపాల్ జాతీయ స్థాయిలో డా,B.R. అంబెడ్కర్ నేషనల్‌ ఫెలోషిప్‌ అవార్డు 2021కు ఎంపికై ఈ అవార్డును డిసెంబర్ 11 న న్యూ ఢిల్లీ లోని దళిత రైటర్స్ కాన్ఫరెన్స్ హాల్లో పంచశీల ఆశ్రమంలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌పీ సుమనాక్షర్‌ చేతుల మీదగా అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దుర్గం గోపాల్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా నేతకాని మహార్ మరియు దళిత బహుజనుల ఆత్మగౌరవం కోసం నిరంతరం సమాజానికి సోషల్ గా సేవ చేయడం ఎంతో తృప్తినిస్తున్నదన్నారు. ఇలాంటి అరుదైన అవకాశం లభించడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన దళిత సాహిత్య అకాడమీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జితేందర్‌ మనూకి, దుర్గం నర్సయ్యకి అయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,