రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించే వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఐకమత్యం తో పోరాడుదాం అని రాజ్యాంగ అవగాహన వేదిక జిల్లా అధ్యక్షులు అస్గర్ అలీ పిలుపునిచ్చారు . ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాలను (52వ వారం) జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం తో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయాలని ఆయన అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని దాదాపు 60 దేశాల రాజ్యాంగం లను అధ్యయనం చేసి మన దేశ రాజ్యాంగమును రచించారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మునిసిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్ నాయక్, బర్రె సుదర్శన్,దర్గాయి దేవేందర్ ,అందె నరేష్ సిలివేరు రమేష్, రావుల రాజు, శేక్ హమీద్ పాషా, మజహర్ (బబ్లూ), బుగ్గ రమేష్, తదితరులు పాల్గొన్నారు.