నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…

రాయల్ పోస్ట్ ప్రతినిధి మహబూబ్ బాద్ : నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం పనులను వేగవంతంచేసి త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శనివారం కురవి రోడ్డులోని నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ పనులను అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

21.31 ఎకరాలలో నిర్మించతలపెట్టిన నూతన కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణ పనులను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు ఎకరాల స్థలంలో 33 కార్యాలయాలకు గదులను నిర్మిస్తున్నందున సదర్ విభాగాలన్నీ కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ముందుగా భవన రూపురేఖలను తెలిపే విధంగా కలెక్టర్ కార్యాలయం భవనం ఆవరణ పరిశుభ్రం చేయించాలని భవనానికి అడ్డుగా ఉన్న కట్టడాలను కూల్చివేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. విద్యుత్ ,మిషన్ భగీరథ connection లను త్వరితగతిన తీసుకోవాలన్నారు.

విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమయ్యే స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఏవో ను ఆదేశించారు .

హెలిప్యాడ్ నిర్మాణం కొరకు స్థలం పరిశీలించాలని సెప్టిక్ ట్యాంక్ నిర్మించేందుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. మరుగుదొడ్లు ఏసీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ప్రతివారం పూర్తవుతున్న ప్రగతి నివేదికల ద్వారా ఇవ్వాలన్నారు.

కార్యాలయం ముందు భాగంలో పార్కు, ప్లాంటేషన్ , వాహనాల పార్కింగ్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నూతన కలెక్టర్ కార్యాలయ భవనసముదాయం 21. 31 ఎకరాలలో చేపట్టడం జరిగిందని ఏడు ఎకరాలు గుట్ట ప్రదేశమని రెండెకరాలు కార్యాలయ భవన నిర్మాణం అని మిగతా 12 ఎకరాలు కార్యాలయం చుట్టూ ఉన్న ప్రదేశం అని మ్యాప్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు వివరించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ. నరేష్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానేశ్వర్, డి.ఈ. రాజేందర్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న, మిషన్ భగీరథ ఏఈ హరీష్, ఎన్విరాన్మెంట్ అధికారి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.