గ్రామపంచాయతీ కార్మికులపై
2021 డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో మండల కార్యాలయం వద్ద ధర్నాలు….

రాయల్ పోస్ట్ ప్రతినిధి నిజామాబాద్: గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలు ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పిఆర్సి ప్రకారం నెలకు పంతొమ్మిది వేల ఐదు వందలు(19,500) రూపాయలు వెంటనే ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను డిమాండ్ చేస్తూ 2021 డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపును పంచాయతీ కార్మికులు జయప్రదం చేయాలని, నిజామాబాద్ జిల్లా కార్మిక సంఘాల జేఏసీ భాగస్వామ్య సంఘాలు ఐఎఫ్టియు,సి ఐ టి యు లు డిసెంబర్ 11వ తేదీన సిఐటియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
పంచాయతీ కార్మికుల మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచాలని, పంచాయతీ కార్మికులు మరణిస్తే ఒక్కొక్కరికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పంచాయతీ ఉద్యోగ కార్మికులను క్రమబద్ధీకరించాలని,
జిపి కార్మికులు ప్రధానంగా దళితులు మైనార్టీలు కనుక వారికి డబుల్ బెడ్ రూమ్ పథకం ప్రత్యేకంగా అమలు చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.