రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్/ స్థానిక భద్రాద్రి థియేటర్ లో నయీమ్ డైరీ సినిమాను తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో సినిమాను నడవకుండా అడ్డుకుని సినిమా పోస్టర్లను తగలబెట్టారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు కావాలి. యాదయ్య మాట్లాడుతూ.తెలంగాణ ఉద్యమ కారిణి గా గానకోకిలగా,ప్రజా చైతన్య స్ఫూర్తినిరగిలించివాన విప్లవమూర్తి వీరనారి బెల్లి లలితక్క కార్మిక సంఘం నాయకురాలిగా ఎదిగి ప్రజల హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టింది. అలా మొదలైన తన ఉద్యమ స్వరూపం నిరంతరం ప్రజా సమస్యలపై ఎక్కుపెట్టింది.
బెల్లి లలితక్క అంటేనే విప్లవానికి ప్రతీక. వారి జీవిత ఘట్టాలపై కొన్ని తప్పుడు కథనాలు సృష్టించి
దాము బాలాజీ నిర్మించిన నయీమ్ డైరీ సినిమాలో అసభ్యంగా బెల్లి లలిత జీవిత చరిత్రను నిర్మింప చేయడం చాలా బాధాకరం అన్నారు.ఆనాటి నరహంతక ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగా హంతక ముఠా చేతిలో అనేక భాగాలు గా నరికి చంపేశారు.
వారి జీవిత ఘట్టాలపై కొన్ని తప్పుడు కథనాలు సృష్టించి సినిమా చేస్తూ నేటి సమాజాని కి తప్పుడు సంకేతాలు ఇవ్వడా నికి ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విడుదల కానివ్వమని విడుదల చేస్తేసినిమాను సినిమా యాజమానులు నష్టపోతారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి కాష పాక మహేష్, బెల్లి లలిత అభిమానులు భూషపాక మహేష్, గుర్రం సంజీవ, మొక్క జాగ్రల్, రాసాల నవీన్, నరాల రాజు, బాలక్రిష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.