రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడు క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో ఎంపిక చేయబడిన క్రైస్తవ అభ్యర్దులు రాష్ట్ర ప్రభుత్వంచే గౌరవ సత్కారము పొందుట కొరకు అర్హులైన క్రైస్తవ అభ్యర్దుల నుండి ధరఖాస్తులు ఆహ్వనించబడుతున్నవి. సామాజిక సేవారంగం, విశిష్టమైన వైద్యసేవలు, విద్యాబోధన, సాహిత్యం, కళలు మరియు క్రీడారంగాలలో 10 సం IIల పైబడి విశేషమైన సేవలు అందించిన క్రైస్తవులు మరియు వైద్య విధ్య సామాజిక సేవారంగాలలో 30 సం IIల పైబడి సేవచేస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు గౌరవ సత్కారం అందుకోనుటకు అర్హులు, దరఖాస్తు తేది: 11.12.2021 నుండి 14.12.2021 వరకు.
నామినేషన్లు http://www.tscmfc.in అంతర్జాలమునందు గాని, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ కార్యాలయం, భువనగిరి నుండి పొందగలరు. దరఖాస్తు చేయగోరు అభ్యర్దులు/సంస్థలు తమ నామినేషన్ నిర్ణీత నమూనాలో జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ కార్యాలయం, భువనగిరి నందు తేది: 14.12.2021 సాయంత్రం 5.00గం.లోగా దరఖాస్తులను అందచేయవలెను.
మరిన్ని వివరాల కొరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం, పాత మున్సిపల్ కాంప్లెక్స్ ,పాత బస్ స్టాండ్ భువనగిరి.సెల్ నెంబర్: 9849901156, 9505640004 ను సంప్రదించ గలరు.