రాయల్ పోస్ట్ ప్రతినిధి షాద్ నగర్ :300 బస్తాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న ఘటన షాద్ నగర్ పట్టణ శివారులోని శివారులో చోటుచేసుకుంది ..ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం కొందరు వ్యక్తులు కలిసి కేశంపేట నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ముచేస్తున్నారని,ఈ నేపథ్యంలో గోపాల్ ,గణేష్ అనే వ్యక్తి కేశంపేట నుండి అక్రమంగా 300 బాస్టాళ్ల రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చి షాద్ నగర్ శివారులోని ఒక షెడ్డులో ధాచి ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ,ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వావుంచిన వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుందరయ్య తెలిపారు ..