బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల 3 రోజుల సమ్మె కు ఎస్ ఓ కె స్ సంపూర్ణ మద్దతు

రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: సింగరేణి కార్మికుల మూడు రోజుల సమ్మెకు మద్దతుగా ఎస్ కె ఎస్ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది.
కార్మికులు వారి హక్కుల కోసం 9,10,11 వ తేదీల్లో తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం కోరుతుంది .

సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు యజమాన్యం ప్రయత్నిస్తోందని .. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె బాట పట్టాలని, ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు 72 గంటల సంపూర్ణ సమ్మెకు కార్మిక సంఘాలు సంసిద్ధం కావాలని, సింగరేణికి చెందిన కెకె-6, కోయగూడెం బ్లాక్‌-3, సత్తుపల్లి బ్లాకు-3, శ్రావణ్‌పల్లి బొగ్గు బ్లాకులను వేలం నుంచి తొలగించి తిరిగి సింగరేణికే ఇవ్వాలని‌డిమాండ్‌ చేస్తూ, ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ,అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40కి పెంచాలని.. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు… ఆర్జిత లాభాలు కనుమరుగవటంపై, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలను వెంటనే చెల్లించాలని. ఇతర 12 డిమాండ్ల పై సాధనకై యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని ఈ సమయం నిర్వహిస్తున్నామని అని ప్రతి ఒక్కరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.