రాయల్ పోస్ట్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా,: ఇబ్రాహింపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న 15మంది వికలాంగులకు కృత్రిమ కాళ్ళు,చేతులు సుమారు రూ.50 వేల సొంత నిధులతో ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రమాదాలలో కాళ్ళు,చేతులు కోల్పోయిన వికలాంగులకు కృత్రిమ కాళ్ళు, చేతులు అందజేయడంలో చాల సంతోషం,తృప్తి కలిగిందని తెలిపారు.వికలాంగుల చేయుతకు తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని తెలిపారు.అదేవిధంగా నియొజకవర్గంలో కాళ్ళు,చేతులు లేని వారికి నియొజకవర్గ కేంద్రములోనే ప్రత్యేక క్యాంపు(సొంత నిధులతో) జనవరి మొదటి వారంలో కృత్రిమ కాళ్ళు,చేతులు పంపిణీ చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమములో వి హెచ్ పి ఏస్ రాష్ట్ర ఉపాద్యక్షులు కాళ్ళ జంగయ్య,తెరాస పార్టీ మంచాల మండల అద్యక్షులు చీరాల రమేష్,మొండిగౌరెళ్ళి సర్పంచు బండిమీది క్రిష్ణ మాదిగ,వి హెచ్ పి ఏస్ జిల్లా నాయకులు గువ్వల యాదయ్య,మద్దెల బాల్ రాజు,దంచుక అశోక్,మహ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.