.

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్/కలెక్టర్ సమావేశ కార్యక్రమంలో జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వాల్టా చట్టం ద్వారా బోర్ వెల్ అనుమతుల ఆన్లైన్ అప్లికేషన్స్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉపసంచాలకులు జ్యోతి కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి సునంద, మిషన్ భగీరథ ఇఇ లక్ష్మణ్, భువనగిరి మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్ ఖని భూగర్భ శాఖ ఏడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ స్టేట్ వాటర్ మరియు ట్రీ ఆక్ట్ – 2002 వాల్టా చట్టం ద్వారా వ్యవసాయ, గృహ అవసరాలు, పరిశ్రమలకు, ఇతర రంగాలకు అవసరమైన బోర్ వెల్ దరఖాస్తులను ఇ సేవ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా సంబంధిత తాసిల్దార్ ఐదు రోజులలో ఎంక్వయిరీ రిపోర్టు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారికి పంపడం జరుగుతుంది. అనంతరం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారు క్షేత్రస్థాయిలో బోర్ పడే పరిస్థితులను పరిశీలించిన రిపోర్ట్ తిరిగి తాసిల్దార్ ద్వారా సంబంధీకులకు ఆన్లైన్ ద్వారా వెళుతుంది. అనంతరం 7 రోజుల్లో విద్యుత్ కనెక్షన్ అందించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం 14 రోజులలో పూర్తవుతుంది.