11వ పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్

రాయల్ పొస్ట్ ప్రతినిధి షాద్ నగర్,: మున్సిపల్ కార్మికులకు పెంచిన జీతాలు చెల్లించాలనీ,
11వ పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, ఛైర్మన్ కొందుటి నరేందర్ లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ ఈశ్వర్ నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అనేక ఆందోళనలు పోరాటాలు సమ్మెలు చేసి సాధించుకున్న జీవో నెంబర్ 60ను అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందని వారు అన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులందరికి కేటగిరీల వారీగా జీతాలు చెల్లించాలని అదే రకంగా 11 వ పీఆర్సీలో పెరిగే జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేరకంగా కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. మరియు కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని మున్సిపల్ కార్మికులకు కనీస సౌకర్యాలు మరియు భద్రత కల్పించాలని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సి.యాదయ్య, కిషన్ నాయక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు..