భరతమాత గొప్ప యోధుని కోల్పోయింది
బీజేపీ షాద్ నగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి సీడీఎస్ చీఫ్ బీపిన్ రావత్ కు ఘన నివాళులు

రాయల్ పోస్ట్ ప్రతినిధి: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో భరతమాత ముద్దుబిడ్డ సీడీఎస్ చీఫ్ బీపిన్ రావత్,
ఆయన సతీమణి మధులిక రావత్ మరియు13 మంది ఆర్మీ జవానులకు భారతీయ జనతా పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్యకుడలిలో ఈ సందర్భంగా శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. త్రివిధ దళాలను అనుసంధానం చేస్తూ బారత ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం దేశ రక్షణ విషయంలో ఎంతో కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు. బారత దేశం గొప్ప యోధుని కోల్పోయిందనీ, నిరంతరం శత్రు దేశాల కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ శత్రువుల గుండెల్లో సింహస్వప్నంలా
ప్రపంచంలోనే బలమైన ఆర్మీగా భారత ఆర్మీ సైన్యాన్ని తయారుచేస్తూ ఆర్మీ అంటే ఓ ఉద్యోగం కాకుండా శారీరకంగా మానసికంగా భారత మాత సేవకై తన ప్రాణాలను సైతం అర్పించటానికి సంసిద్దులై ఉండాలని వారు చెప్పిన మాటలు భవిష్యత్ తరానికి ప్రేరణ ఇస్తుందని అన్నారు. తన కుటుంబ నేపథ్యం మొత్తం ఆర్మీలో సేవలందించటం వారికి దేశం పైన మనదేశ సైన్యం మీద ఎంత మక్కువో అర్థమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మఠం ఋషికేష్, విష్ణువర్ధన్ రెడ్డి మల్చలం మురళి, వంశీకృష్ణ, ఎంకనోళ్ళ వెంకటేష్, మోహన్ సింగ్,హరీష్ ముదిరాజ్, శ్రీనివాస్ చారి,శ్రీకాంత్ యాదవ్,గజ్జల ప్రవీణ్,శ్యాం సుందర్ రెడ్డి,అనిల్ తదితరులు పాల్గొన్నారు..