రాయల్ పోస్ట్ ప్రతినిధి/(మోటకొండూర్ )యాదాద్రి భువనగిరి జిల్లా/మోటకొండూర్ మండల కేంద్రం మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ నాగరాజు అన్నారు.
ఎస్ ఐ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాధిప్రమాదం పొంచిఉన్న నేపధ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగ మాస్కులు ధరించాలని, మాస్కులు లేకుండా రోడ్లమీదికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వెయ్యి రూపాయలు జరిమాన తప్పదని అన్నారు.
గుంపులు గుంపులుగా ఉండొద్దని, భౌతిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్ వాడాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని అన్నారు.
ఏమైనా ఆరోగ్య ఇబ్బందులు అనిపిస్తే గ్రామ సర్పంచ్ మరియు ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని ప్రజలను కోరారు.