పశువుల హాస్పిటల్ కు గులాబీ రంగు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్/
యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలోని గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ బిల్డింగ్ కు గులాబీ రంగు వేయడం చర్చనియాంశమైంది .బిల్డింగ్ రిపేరింగ్ ప్రభుత్వం 2.80లక్షలు మంజూరు చేసింది. ఇందులో భాగంగా బిల్డింగ్ కు పర్పుల్ కలర్ పెయింట్ వేయాలి కాని ఆధికార పార్టీ జెండా రంగు వేయడం.సరి కాదు అని బిల్డింగ్ కు వెంటనే గులాబీ రంగు తొలగించాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ లోడే నవీన్ గౌడ్ ,బిజెపి నాయకులు, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.