….

రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / సోనియమ్మ పుట్టిన రోజున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం గొప్ప విషయం.ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రారెడ్డి.ఈరోజు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తుర్కపల్లి మండల కేంద్రంలో జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా వచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి గారు,మరియు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఒక గౌరవం కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతీ పార్టీ కుటుంబ సభ్యునికీ గుర్తింపు కార్డు, 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని
అధికారంలో ఉన్న తెరాస, బీజేపీ కలిసి రైతులను, ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణకు రక్ష రైతులు, నిరుద్యోగులు,చిన్న వ్యాపారులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని సభ్యులను చేర్పించడంలో, పార్థిని బలోపేతం చేయడానికి నాయకులు పరస్పరం పోటీ పడాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలో ఇల్లు లేని సుమారు 10 కుటుంబాలకు తన స్వంత ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇస్తానని ఈరోజు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగిందని కల్లూరి రాంచంద్రారెడ్డి చెప్పడం జరిగింది ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు