యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 9 : యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని రుద్రనేత్ర సంస్థ అధ్యక్షుడు చంద్ర మోహన్ గౌడ్ రేఖల కోరారు. గురువారం 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్బంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయ చిరునామా, సంబంధిత అధికారి సెల్ నంబర్ తో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతూ రుద్రనేత్ర సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా చంద్రమోహన్ గౌడ్ రేఖల మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాల్లో అభివృద్ధిని కబళిస్తున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఐక్యరాజ్య సమితి సంకల్పించి 2003లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఐక్యరాజ్యసమితి లోని సభ్య దేశాలు తమ దేశాలలో అవినీతి నిరోధానికి కఠిన చట్టాలు చేయాలని అడ్డుకట్ట వేసే వ్యవస్థలను సమస్యలను నెలకొల్పాలని, పాలనలో పారదర్శకతకు చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబు దారితనం తీసుకురావడం కోసం, చట్టాలను బలోపేతం చేయాలని, డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ చిరునామా, సెల్ నెంబర్ లతో కూడిన బోర్డులను, సిటిజన్ చార్ట్ లను, సమాచార హక్కు బోర్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా ప్రజలకు ఏసీబీ అధికారుల చిరునామా, సెల్ ఫోన్ నెంబర్ తెలుసుకోవడంతో అవినీతి అక్రమాలపై సామాన్య ప్రజలు, బాధితుల్లో సైతం ఫిర్యాదు చేసే అవకాశం లభిస్తుందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అవినీతి నిరోధక శాఖ వారి చిరునామాను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రుద్రనేత్ర సంస్థ కార్యదర్శి పత్తి శ్రీధర్, జితేందర్, మోహన్, రేఖల దీప్తి తదితరులు పాల్గొన్నారు.