యాదాద్రి భువనగిరి జిల్లా/ మోటకొండూర్ డిసెంబర్ 9 (రాయల్ పోస్ట్ ప్రతినిధి) కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి మంచి అవకాశమని మోటకొండూర్ ఎస్ఐ నాగరాజు అన్నారు.

గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను,
రాజీ పడదగిన అన్ని కేసులలో ఇరువర్గాల స్వచ్ఛందంగా రాజీ చేసుకొనుటకు ఒక గొప్ప అవకాశమని అన్నారు.
మోటకొండూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోగల చిన్న చిన్న కారణాలతో, భూతగాదాల తో క్షణికావేశంలో జరిగిన గొడవలు,రోడ్డు ప్రమాదం కేసు నమోదైన వారు పోలీస్ స్టేషన్ వచ్చి వివరాలు ఇవ్వాలని,
పోలీసువారి సహకారం తీసుకొని ఆలేరు కోర్టులో ఉదయం 9గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రాజీ కుదుర్చుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ నాగరాజు కోరారు.