రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో నీ ,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కొత్త నరసింహ స్వామి ఆధ్వర్యంలో పోచంపల్లి మాజీ సర్పంచ్ తడక వెంకటేశ్ అధ్యక్షతన చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను విడుదల చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త.నరసింహస్వామి పాల్గొని మాట్లాడుతూ దేశంలో జరగబోయే జనాభా లెక్కల లో బీసీ కులాల జనాభా లెక్కలు కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూ బీసీల జనాభా లెక్కలు జన గణనలో చేపట్టాలని ఈనెల13,14,15,తేదీలలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నా కార్యక్రమానికి బీసీలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పోచంపల్లి మండలం లో ఉన్న బీసీ కుల సంఘాల నాయకులను వివిధ బిసి ప్రజాప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో గునిగంటి రమేష్ గౌడ్, భారత లవకుమార్, కీర్తి సంజీవ వేముల పాండు, భారత వాసుదేవ్, మోట మహేష్, వంగూరు పండు, గుండు పుల్లయ్య, మెరుగు శశికళ తదితర బిసి నాయకులు పాల్గొన్నారు