రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ- శ్రమ్ పోర్టల్ నమోదు కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి MD. ఇమ్రాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా MD. ఇమ్రాన్ మాట్లాడుతూ అసంఘటీతరంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు ఈ శ్రమ్ కార్డుని తీసుకోవాలని అయన కార్మికులను కోరారు.ఆధార్ లాగా కార్మికులందరికీ ఈ-శ్రమ్ కార్డు ఉపయోగపడుతుందని తెలియజేశారు. 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు కార్మికులకు వర్తిస్తుందని అన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, వర్తించే వారు, ఐ టి రిటర్న్స్ నమోదు చేసుకునేవారు తప్ప ఈ పథకానికి అన్ని తరగతుల కార్మికులు అర్హులు అని అన్నారు. ఈ సందర్భంగా కార్మికుల నమోదు కార్యక్రమాన్ని అక్కడే ఫోన్ లో ప్రారంభించి కార్మికులకు కార్డు లను ఇవ్వడం జరిగింది. కార్మికుడు మరణిస్తే రెండు లక్షల భీమా సౌకర్యం అందుతుందని అన్నారు. ప్రమాదంలో గాయపడితే లక్ష రూపాయలు అందుతుందని అన్నారు. కార్మికులను చైతన్యం చేసే పని ఏఐటీయూసీ చేపడుతుందని ఈ సందర్బంగా అయన అన్నారు. అందులో భాగంగానే సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద కార్మికుల కోసం ఈ- శ్రమ్ కార్డుల నమోదు కార్యక్రమం ఉచితంగానే చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సామల శోభన్ బాబు, సారా కృష్ణ,aisf నాయకులు శాంతి కుమార్ ఆర్.ఆర్.బి మూలం బాబు రమేష్ బుచ్చయ్య అశోక్ అశోక్ కృష్ణ రాములు రవి రాజు తదితరులు పాల్గొన్నారు