రాయల్ పోస్ట్ ప్రతినిధి ఒస్మానియా యూనివర్సిటీ హైదరబాద్ : ఓయూ జెఎసి చైర్మన్ భీమ్ రావు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ భీమ్ రావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓ యు సి ఐ రమేష్ జిహెచ్ఎంసి ఈ ఈ వేదకుమారి హాజరై యశ్వంత్ ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆఫ్రికా ఖండంలోనే అతి ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని అతి చిన్న వయసులో అధిరోహించడం చాలా గొప్ప విషయం ఇలాంటి ప్రతిభ ఉన్న యశ్వంత్ ను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. నేను మరొక శిఖరాన్ని అధిరోహించాలి అనుకుంటున్నాను నేను ఒక పేద గిరిజన విద్యార్థిని ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసే మరెన్నో శిఖరాలు అధిరోహిస్తాను అని యశ్వంత్ నాయక్ పేర్కొన్నారు.