యాదాద్రి భువనగిరి జిల్లా:- ఆత్మకూరు (యం) మండలం ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు శ్రీమతి శ్రీ గోంగిడి సునీతా మహేందర్ రెడ్డి గార్ల సహకారంతో పల్లెర్ల గ్రామపంచాయతీ సిబ్బందికి దుప్పట్లు అందజేసిన మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్

వారు మాట్లాడుతూ కరోనా సమయంలో గ్రామపంచాయతీ సిబ్బంది చేసిన సేవలు అభినందనీయమన్నారు ఆత్మకూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల సిబ్బందికి దుప్పట్లు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు చుంచు నాగరాజు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్ మరియు గ్రామ పంచాయతీ కారో బోర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.