డయల్ 100 కాల్ తో వెంటనే స్పందించి తప్పిపోయిన బాబు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన మంచిర్యాల బ్లూ క్లోట్స్ పోలీసులు

రాయల్ పోస్ట్ ప్రతినిధి రామగుండం మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వాస్పత్రి కి చెల్లెలి చికిత్స నిమిత్తం రాగా తన కుమారుడు ఆడుకుంటూ కనిపించక పోవడం తో వారి కుటుంబీకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి ఎక్కడా కనిపించక పోయేసరికి కంగారుపడి డయల్ 100 కి కాల్ చేయగా అట్టి సమాచారాన్ని అందుకున్న మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్ బ్లూ క్లోట్స్ సిబ్బంది పిసి 217 ఉస్మాన్, పిసి 3434 తిరుపతిని అప్రమత్తం చేయగా ఔట్ పోస్ట్ పిసి శ్రీధర్ తో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా బాబు మెయిన్ రోడ్ వైపు నడుచుకుంటూ వెళ్ళడం గమనించి బాబును పట్టుకొని వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరిగింది. డయల్ 100 కి కాల్ చేయగానే వెంటనే స్పందించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కి బాబు తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.