రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణం లోని న్యూ దీప్తి హోటల్ లో జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహనా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన మాజీ మంత్రివర్యులు సంభాని చంద్రశేఖర్ . ఈ సంధర్బంగా సంభాని చంద్రశేఖర్ , మాట్లాడుతూ దేశంలో మొట్ట మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందని తెలియజేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రత్యేక చోరువ తీసుకొని నమోదు అయిన ప్రతి సభ్యునికి భీమ సాకర్యం కల్పించారన్నారు. అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనిగిరి జిల్లాలోని అన్ని మండలాల లో దాదాపుగా ప్రతి బూత్ కి ఎన్రోలర్ ల నియామకం జరిగింది అని మిగితా బూత్ లలో కూడా ఎన్రోలర్ ల నియామకం చేపట్టాలని మండల అధ్యక్షలకు తెలియజేశారు. బూత్ స్థాయిలో ఎన్రోలర్స్ సభ్యత్వా నమోదుకు కృషి చేసి ప్రతి బూత్ లో 100 మంది సభ్యులను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య కాంగ్రెస్ నాయకులు అయోధ్య రెడ్డి , ఉపేందర్ రెడ్డి , తంగాల్లపల్లి రవికూమర్, బీర్ల ఐలయ్య, రామాంజనేయులు గౌడ్, పోత్నక్ ప్రమోద్, ఎంపీపీ రమేష్ రాజ్, ఆలేరు మాజీ శాసన సభ్యులు డాక్టర్ నగేష్ మండల – పట్టణ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, పటోళ్ల శ్యామ్ గౌడ్, పాక మల్లేష్ యాదవ్, బీసుకుంట్ల సత్యనారయణ, పాశం సత్తి రెడ్డి, రమేష్ గౌడ్, తడక వెంకటేష్ యదాద్రి జిల్లా లోని అన్ని మండల మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసి లు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.