రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తు ఎస్ఐ జయరోద్దీన్ గారు ఈ సంవత్సరం కరోనాతో మరణించగా వారి భార్య షహాదా తబస్సున్ గారికి భద్రత నుండి 7,35,735 లక్షల రూపాయల చెక్ ను ఈ రోజు సీపీ గారి కార్యాలయం లో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరణించిన ఎస్ఐ గారి కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ గారు అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్., గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఓ నాగమణి గారు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, రామగుండం కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్ల కుంట పోచలింగం, సీసీ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.