రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి ఖిల్లా దగ్గర టీఆర్ఎమ్మెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ల సుమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యెస్ రాజశేఖర్ రెడ్డి ముదిరాజ్ లను బీసీ ఏ లో చేరుస్తూ ఇచ్చిన జీఓ నఁబర్ 15 కోర్ట్ లొనే ఏండ్ల కొద్దీ నానుతుందని ముదిరాజ్ ల స్థితి గతులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించి యుంటే అభివృద్ధిలో రెండు తరాలు వెనక్కు పోకుండా యువకులు రిజర్వేషన్లు పొంది విద్య ఉద్యోగాలలో ముందంజలో ఉండేవారన్నారు,ముదిరాజ్ జాతి ఆందోళనలో ఉందని న్యాయమైన హక్కులు కల్పించకుండా మభ్య పెడుతున్నారని సంఘాలు పార్టీల కతీతంగా రిజర్వేషన్ కొరకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని యువతకు పిలుపునిచ్చారు

కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కుడుముల శ్రీనివాస్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాల్లు రుద్రమ రజని, పండుగ ఝాన్సీ, క్రమశిక్షణ విభాగం చైర్మన్ పొరుబోతుల సతీశ్,పండుగ ప్రభాకర్,వరుణ్, సింగారం మల్లయ్య ముదిరాజ్,బర్ల పోచయ్య, సోఖం వెంకట్, బాలమణి తదితరులు పాల్గొన్నారు