రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై ఉన్న ముసుగును పలువురు తొలగించడం బాధ కలిగించిందని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ప్రారంభం కొద్దిగా లేట్ అయినప్పటికీ, అంబేద్కర్ విగ్రహం వద్ద కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని, విగ్రహం వద్ద మట్టి పనులు జరుగుతున్నాయని,మొక్కలు కూడా పెడుతున్నామని వారు పేర్కొన్నారు. విగ్రహం ప్రారంభానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. అయినప్పటికీ కొంతమంది విగ్రహంపై ఉన్న ముసుగు తొలగించడం దళిత ప్రజలను బాధపెట్టిందన్నారు. త్వరలోనే అంగరంగ వైభవంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభం జరుగుతుందని నాయకులు తెలిపారు. మళ్ళీ యధావిధిగా విగ్రహంపై ముసుగుని నాయకులు కప్పడం జరిగింది.కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు సముద్రాల మురళి వర్కింగ్ ప్రెసిడెంట్ కుటుంబాల రాజేష్ నాయకులు కుసుమ మధుసూదన్, కాసర్ల యాదగిరి ఎల్తురి శంకర్,కాంపెల్లి రాజం, జనగామ మల్లేష్ దాసరి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు