బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన అంబేద్కర్….

రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని 15వ వార్డు ప్రజలు పేర్కొన్నారు.వార్డులో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 65వ వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టేకులబస్తీ వార్డులోని పలువురు పేద ప్రజలకు మాజీ కౌన్సిలర్ రామగిరి రామకృష్ణ పుట్టినరోజు సందర్బంగా చింతల వసంత,బాలరాజు,లోకేశ్వర్ లు బట్టలు,దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ బి ఆర్ అంబేద్కర్ భారతదేశంలో కుల నిర్మూలన,స్వేచ్ఛ,బానిసత్వంసమానత్వం కోసం ఆయన పోరాడారని అన్నారు.నేడు భారతదేశంలోని అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారంటే అందుకు ఆయన చేసిన కృషి అని అన్నారు.కార్యక్రమంలో బస్తీవాసులు గొడిసెల శ్రీహరి,బొల్లు వంశీ,రజినీకాంత్,కట్నం ఐలయ్య,దెబ్బటి రమేష్,అరెపల్లి వేణు,రమాకాంత్,శ్యామ్,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.