రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి :ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు.

సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ఆయన ప్రజల నుండి 82 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో 57 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి.