రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: డా బి.ఆర్.అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సి పి ఐ), భువనగిరి మండల సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది
సామాజిక న్యాయం, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల, ధరలు ,పెట్రోల్, డీజీల్,గ్యాస్ ,ధరలు నిరుద్యోగం,దళితులు , గిరిజనులు,మైనారిటీ ,మరియు ,,మహిళలపై ,దాడులను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వాటి విషయంలో పోరాటాలు ఉదృతం చేయాలని పార్టీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో సి పి ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ మండల కార్యదర్శి ముదిగొండ రాములు ,మండల కార్యవర్గ సభ్యులు గుండ్ల లక్ష్మయ్య, ఉడుత రాఘవులు ,పట్టణ నాయకులు పుట్ట రమేష్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ,జిల్లా కౌన్సిల్ సభ్యులు సూరారం జానీ , ఐలయ్య తదితరులు పాల్గొన్నారు