రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఘనంగా పచ్చల కట్ట సోమేశ్వర, భువనేశ్వరి మాత ఆలయంలో, హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ
భువనగిరి పట్టణంలోని శ్రీ పచ్చల కట్ట భువనేశ్వరి మాత ఆలయంలో ఈరోజు ఘనంగా గా హరిహరపుత్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజ్ శర్మ ప్రవీణ్ శర్మ పుట్టపాక భీష్మ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ కాలేరు లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణరావు మాట్లాడుతూ భువనగిరి శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్పస్వామి పడిపూజ ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది స్వామి వారిని మనసారా వేడుకుంటూ మళ్ళీ రాబోతున్న కరోనా థర్డ్ వేవు నుండి ప్రజలను కాపాడాలని అలాగే భువనగిరి పట్టణ ప్రజలు కూడా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్ లీడర్ మాయ దశరథ ఆలయ మాజీ కమిటీ చైర్మన్ దేవరకొండ నరసింహాచారి గురు
స్వాములు సాధు ఉపేందర్ శ్రీనివాస్ బాల్రాజ్ కొల్లూరి రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని చెప్పారు.