రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఈ రోజు బి యన్ తిమ్మాపురం గ్రామం సర్పంచ్ పిన్నం లతారాజు గారి ఆధ్వర్యంలో JC శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామ భూ నిర్వాసితులు ఉపాధి లేక, జీవనోపాధి కోసం వేరే ప్రాంతాలకు వెల్లి జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో వారి యొక్క ఇండ్లు, వ్యవసాయ భూములు ప్రాజెక్టు లో మునిగి పోతున్నందున ప్రభుత్వం తీసుకోవడం జరిగింది , వీరందరు గ్రామ సర్వేలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇంటి KP నంబర్ ని కూడా కేటాయించారు. కాని R&R ప్యాకేజి రాలేదు. దయచేసి గ్రామ సర్వేలో పాల్గొన్న వారందరికీ R&R ప్యాకేజి ని వర్తింప చేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ కన్వీనర్ వల్దాసు రాజ్ కాళభైరవ,కో కన్వీనర్ రావుల శ్రీను,గండయ్య, నర్సింహ్మ చారి, మోర మోహన్ రెడ్డి, జూపల్లి బాలయ్య,జిన్నా క్రిష్ణ,డొంకెన శ్రీశైలం,నాగారం ఉపేందర్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు